ప్రధాని విశాఖ పర్యటన ఖరారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారయింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారయింది. ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు.ఈ నెల 20వ తేదీన భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ రాత్రికి రాత్రి విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేయనున్నారు.
రెండు రోజలు విశాఖలోనే...
ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ బీచ్ లో యోగా డే ఉత్సవాల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటానని అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినప్పుడు చెప్పారు. చెప్పినట్లుగానే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే యోగా డేలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.