వచ్చే నెలలో విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. వచ్చే నెల పదోతేదీన విశాఖపట్నానికి రాష్ట్రపతి వస్తున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. వచ్చే నెల పదోతేదీన విశాఖపట్నానికి రాష్ట్రపతి వస్తున్నారు. విశాఖలో రాష్ట్రప్రతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పర్యటనలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో జరగనున్న తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు.
అక్కడి నుంచి...
ఉదయం పదకొండున్నర గంటలకు విశాఖకు చేరుకోనున్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము తర్వాత రోడ్డు మార్గంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళతారు. అక్కడ కార్యక్రమం ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు ఝార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో జూన్ పదోతేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ వస్తున్న సందర్భంగా అధికారులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించనున్నారు