పహాల్గాం ఘటనలో ఇద్దరు తెలుగు వారి మృతి

జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో విశాఖ వాసితో పాటు హైదరాబాద్ నివాసి మరణించినట్లు కనుగొన్నారు

Update: 2025-04-23 02:36 GMT

జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో విశాఖ వాసి మరణించినట్లు కనుగొన్నారు. ఈ దాడిలో తొమ్మిది మంది పర్యాటకులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో విశాఖకు చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి మరణించినట్లు సహయచర టూరిస్టులు కనుగొన్నారు. దీంతో ఈ సమాచారాన్ని విశాఖలోని చంద్రమౌళి కుటుంబ సభ్యలకు అందచేశారు.

హైదరాబాద్ కు చెంది...
నిన్న జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ పహాల్గాం లో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా మూకుమ్మడిగా కాల్పులు జరపడంతో హైదరాబాద్ కు చెందిన మరొక వ్యక్తి కూడా మరణించారు. ఆయనను మనోజ్ రంజన్ గా గుర్తించారు. పహల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రవాది దాడిపై నేడు ప్రధాని మోదీ భద్రతా వ్యవహారాల కమిటీతో సమావేశం కానున్నారు. మంత్రి వర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. సౌదీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఇండియాకు చేరుకున్న ప్రధాని వెంటనే అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేశారు


Tags:    

Similar News