Visakha : విశాఖలో హై అలెర్ట్.. తనిఖీలు ముమ్మరం

విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగుతున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Update: 2025-11-13 04:28 GMT

విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగుతున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో విశాఖను పోలీసులు హై అలెర్ట్ జోన్ గా ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు జరిగే అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విశాఖపట్నంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టుల్లో కూడా బాంబ్ స్క్కాడ్ తనిఖీలను నిర్వహించింది.

భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో...
విశాఖపట్నం భాగస్వామ్య సదస్సుకు ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా తనిఖీలను చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. నేటి నుంచి సన్నాహక సమావేశాలు ప్రారంభం కావడం, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా విశాఖలోనే ఉండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News