Visakhapatnam : విశాఖను ముంచెత్తిన వాన

విశాఖపట్నంలో భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి

Update: 2025-07-14 04:01 GMT

విశాఖపట్నంలో భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. కేఆర్ఎంకాలనీలోని కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో మురుగు నీరు కాలనీలోకి ప్రవేశించింది. దీంతో రహదారిపై నిలిపి ఉంచిన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఇుసక తోట ప్రాంతంలోకి భారీ వర్షపు నీరు చేరింది.

కొట్టుకుపోయిన వాహనాలు...
మద్దెలపాలెం జాతీయ రహదారిపై నీరు నిలవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. విశాఖలో ఎప్పుడు భారీ వర్షం కురిసినా ఈ ప్రాంతం లో మురుగు నీటి కాల్వ నిండిపోయి బయటకు వచ్చి దుర్గంధం వెదజల్లుతుందని, దోమల బెడద ఎక్కువవుతుందని అనేక మార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆరోపించారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని తమను వరద నీటి నుంచి కాపాడాలని కోరుతున్నారు.


Tags:    

Similar News