Visakhapatanam : నేడు హాట్ హాట్ గా జీవీఎంసీ సమావేశం

నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పరేషన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశం హాట్ హాట్ గా సాగనుంది

Update: 2025-08-22 04:31 GMT

నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పరేషన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశం హాట్ హాట్ గా సాగనుంది. మేయర్ పీలా శ్రీనివాస్ కు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అధికార పార్టీకి కూడా కొంత ఇబ్బందిగా మారే అవకాశముందని చెబుతున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సందర్భంగా అజెండా ప్రకారం వెళతామని అధికారపార్టీ చెబుతుంది.

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై...
అయితే స్టీల్‌ప్లాంట్ అంశంపై చర్చకు వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టనున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కార్మిక సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉద్యమం మొదలు పెట్టాలని వైసీపీ భావిస్తుంది. దీంతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News