హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వారికి సంక్రాంతికి గుడ్ న్యూస్

హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వారికి గుడ్ న్యూస్. సంక్రాంతి పండగకు సులువుగా హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు.

Update: 2025-09-23 06:39 GMT

హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వారికి గుడ్ న్యూస్. సంక్రాంతి పండగకు సులువుగా హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. జాతీయ రహదారుల సంస్థ ఖమ్మం - దేవరపల్లి జాతీయ రహదారి పనులను శరవేగంగా పూర్తి చేస్తుంది. ఈ రహదరాి వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దీనిని గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మాణం చేపట్టారు. ఇక విశాఖ వెళ్లేవరు విజయవాడ ఏలూరు, రాజమండ్రి మీదుగా ప్రయాణించాల్సిన పనిలేదు. ప్రయాణ దూరం కూడా ఈ రహదారి నిర్మాణంతో తగ్గుతుంది.

ఖమ్మం - దేవరపల్లి జాతీయ రహదారి మీదుగా...
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే పన్నెండు గంటల సమయం పడుతుంది. .676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో మధ్యలో టిఫిన్లు, టీలు, భోజనాల వంటికి ఆగినా ఎక్కువ సమయం తీసుకుంటుంది. విజయవాడ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఖమ్మం - దేవరపల్లి రహదారి నిర్మాణం పూర్తయి అందులో నుంచి విశాఖకు బయలుదేరితే 550 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఐదు గంటల సమయం తగ్గుతుంది. వచ్చే సంక్రాంతి పండగకు విశాఖకు వెళ్లే వారికి ఇది గుడ్ న్యూస్ గా చెప్పాలి.


Tags:    

Similar News