Visakha : నేడు విశాఖ వెళుతున్నారా? అయితే ట్రాఫిక్ ఆంక్షలున్నాయ్

నేడు సింహాచలంలో గిరి ప్రదిక్షణ జరగనుంది. దీంతో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి

Update: 2025-07-09 03:29 GMT

నేడు సింహాచలంలో గిరి ప్రదిక్షణ జరగనుంది. దాదాపు 32 కిలోమీటర్లు భక్తులు గిరి ప్రదక్షిణ చేయనున్నారు. ఈమేరకు అన్ని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి పదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ గిరిప్రదిక్షణ కొనసాగుతుంది. గిరిప్రదిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రేపు సాయంత్రం ఐదు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని విశాఖ పోలీస్ కమిషన్ శంఖబ్రతబాగ్చీ తెలిపారు. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

గిరిప్రదిక్షిణ కోసం...
భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, అలాగే కొన్ని దారుల్లో ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. అడవివిరం, గోపాలపట్నం, పెట్రోలు బంక్ మధ్య వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. అడివివరం నుంచి గిరిప్రదిక్షణ కోసం తొలిపావంచా వద్దకు వచ్చే భక్తుల వాహనాలను అడవివరం కూడలిలోని పార్కింగ్ స్థలంలో నిలిపి కాలినడకన రావిచెట్టు కూడలి, గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం కూడలికి చేరుకోవాల్సి ఉంటుంది. అనకాపల్లి నుంచి విశాఖ వచ్చే భారీ వాహనాలను లంకెల పాలెం కూడలి మీదుగా సబ్బవరం వైపు మాత్రమే వెళ్లాలి. విశాఖలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని విశాఖ సీపీ తెలిపారు.


Tags:    

Similar News