మలేషియాకు టీడీపీ అనుకూల కార్పేటర్లు.. వేడెక్కిన విశాఖ రాజకీయం

విశాఖలో క్యాంప్ రాజకీయాలు హడావిడి రాష్ట్ర రాజకీయాలను ఆసక్తి కరంగా మార్చింది.

Update: 2025-03-28 03:42 GMT

విశాఖలో క్యాంప్ రాజకీయాలు హడావిడి రాష్ట్ర రాజకీయాలను ఆసక్తి కరంగా మార్చింది. అవిశ్వాసం లెక్కలపై కూటమి పార్టీలు అలర్ట్ అయ్యాయి. కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్ల పాస్ పోర్టులు సేకరించిన నాయకత్వం.. మలేషియా లేదా మరో దేశంలో క్యాంప్ పెడతారని ప్రచారం జరగుతుంది. దీంతో మేయర్ ను దించేయడానికి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఎవరు నెగ్గుతారన్న దానిపై చర్చ గట్టిగానే జరుగుతుంది.

కర్ణాటకకు వైసీపీ కార్పొరేటర్లు...
ఇప్పటికే బెంగళూరులో వైసీపీ కార్పొరేటర్లు మకాం వేశారు. వారిని ఊటీని తరలించేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. ఇటు టీడీపీ, అటు వైసీపీ తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లను క్యాంప్ లకు తరలిస్తుండటంతో ఆసక్తి కరమైన రాజకీయాలు నెలకొన్నాయి. చివరకు ఎవరిది పై చేయి అవుతుందోనన్న లెక్కలతో నేతలు మునిగిపోయారు.


Tags:    

Similar News