Breaking : ఆంధ్రప్రదేశ్ లో భూప్రకపంనలు

ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భూప్రకంపనలు కనిపించాయి. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూప్రకంపనలు కనిపించాయి

Update: 2025-11-04 02:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భూప్రకంపనలు కనిపించాయి. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూప్రకంపనలు కనిపించాయి. ఈరోజు తెల్లవారు జామున భూ ప్రకంపనలతో ప్రజలు రోడ్లపైకి ఆందోళనతో పరుగులు తీశారు. అల్లూరి జిల్లా జి. మాడగుల తెల్లవారు జామున 4.19 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేట్ పై 3.7 తీవ్రతగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.

విశాఖ నగరంలోనూ...
విశాఖ నగరంలోనూ పలు ప్రాంతాల్లో భూ ప్రకపంనలు సంభవించాయి. అక్కయ్య పాలెం, రాంనగర్, మురళినగర్ వంటి ప్రాంతాల్లో తెల్లవారు జామున భూప్రకపంపనలు సంభవించడంతో ప్రజలు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. పలు కాలనీవాసులు బయటకు వచ్చి ఆందోళనకు గురయ్యారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News