Montha Cyclone : ఉత్తరాంధ్రలో మొదలయిన భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొంథా తుపాను ప్రభావం కనిపిస్తుంది. భారీ వర్షాలు పడుతున్నాయి
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొంథా తుపాను ప్రభావం కనిపిస్తుంది. భారీ వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలో తుపాను ప్రభావం కొనసాగుతుంది. అత్యధికంగా కొత్తవలసలో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. తాడిపూడి, ఆండ్ర, మడ్డువలస జలాశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. మొంథా తుఫాన్ కాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించి ముందస్తు చర్యలు చేపట్టారు.
బలమైన గాలులు...
తీరం వెంబడి గంటకు 90 నుంచి110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే బలమైన గాలులు మొదలయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని చెప్పారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. తుపాను సహాయ చర్యల కోసం తూర్పు నౌకాదళం సన్నద్ధంగా ఉంది. తూర్పు నౌకాదళంలో అవసరమైన యంత్రాంగాన్ని అధికారులు సిద్ధం చేశారు.తూర్పు నౌకాదళం వద్ద హెలికాప్టర్లు, సరకు రవాణా విమానాలు సిద్ధం చేశారు.