Corona Virus : విశాఖలో కరోనా కలకలం.. క్వారంటైన్ కు?
విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఒక వివాహితకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఒక వివాహితకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీకి చెందిన ఒక వివాహితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెతో కాంట్రాక్టు ఉన్న వారికి కూడా అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివాహిత పిల్లలు, భర్తకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. మహిళను వారం రోజల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
బంధువులతో పాటు...
మహిళతో కాంట్రాక్టు అయిన చుట్టుపక్కల వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులు నిర్ణయించారు. కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయితే వివాహితకు మలేరియా, డెంగ్యూ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరకు కోవిడ్ అని నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి కోలుకున్న మహిళ ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై చుట్టపక్కల ఇళ్ల వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది