మూడు రాష్ట్రాల రహదారి అందుబాటులోకి వస్తే?

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మధ్య ఆరులేన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి

Update: 2025-08-23 07:00 GMT

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మధ్య ఆరులేన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. మొత్తం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిగా నిర్మాణం చేపట్టారు. త్వరలోనే రహదారి అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. ఈ రహదారిపై రాకపోకలు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తరాంధ్ర కు గేమ్ ఛేంజర్ గా...
ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ లో వంద కిలోమీటర్ల మేరకు వెళుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఆరంభమమవుతుంది. దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ఈ గ్రీన్ ఫీల్డ్ నిర్మాణం చేపట్టారు. పూర్తయ్యే దశలో ఉన్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే మూడు రాష్ట్రాల్లో రాకపోకలు కూడా సులువుగా మారతాయని, ఎగుమతులు పెరుగుతాయని తెలిపింది.


Tags:    

Similar News