నేడు విశాఖ స్టీల్ ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్-3 పునఃప్రారంభం
నేడు విశాఖ స్టీల్ ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్-3 పునఃప్రారంభం కానుంది
నేడు విశాఖ స్టీల్ ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్-3 పునఃప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం లాంఛనంగా కొలిమిని కేంద్ర ఉక్కు శాఖ సెక్రటరీ సందీప్ పాండ్రిక్ వెలిగించనున్నారు. ఇప్పటికే రెండు బ్లాస్ట్ పర్నేస్‍లు ఆపరేషన్‍లో ఉన్నాయి. మూడో బ్లాస్ట్ ఫర్నేస్‍తో పూర్తి సామర్థ్యానికి స్టీల్ ప్లాంటు సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు.
రోజుకు 20 వేల టన్నుల స్టీల్...
మూడో బ్లాస్ట్ ఫర్నేస్‍తో రోజుకు 20 వేల టన్నులకు పైగా స్టీల్ ఉత్పత్తి. జరుగుతుందని చెప్పారు. స్టీల్‍ప్లాంటుకు రూ.11,440 కోట్లు ఆర్థిక సాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను తిరిగి ప్రారంభించనుంది. దీనివల్ల ఉక్కు ఉత్పత్తి పెరగడమేకాకుండా ఉపాధి అవకాశాలుకూడా మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.