రేపు విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకులకు రేపు టెండర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించనుంది.
ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవాలని నిర్ణయించింది. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకులకు రేపు టెండర్లను ఆహ్వానించనుంది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో నలభై శాతం పనులకు రేపు టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 21,616 కోట్ల రూపాయలతో విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైలును ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనున్నారు. విశాఖ మెట్రోకు రాష్ర్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ మెట్రోకు వీఎంఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సీఆర్డీఏ నుంచి 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టకు, రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లను పిలవనుంది.