లులుకు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు
విజయవాడ, విశాఖ పట్నంలో లులు సంస్థకు భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ, విశాఖ పట్నంలో లులు సంస్థకు భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్ లో 99 ఏళ్లకు లీజు ప్రతిపదికన 13.74 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖలోనూ...
ప్రత్యేక కేటగిరి కింద మూడేళ్ల లీజు మాఫీకి నిర్ణయం తీసుకునే అవకాశముందని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇక విజయవాడ విద్యాధరపురంలో 4.15 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో లులు మాల్ ఏర్పాటుకు అవసరమైన స్థలం లీజు ప్రాతిపదికన ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.