Pawan Kalyan : నేడు విశాఖకు పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు విశాఖకు రానున్నారు. మూడు రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి

Update: 2025-08-27 05:24 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు విశాఖకు రానున్నారు. మూడు రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చేరుకోనున్నారు. రేపు, ఎల్లుండి పార్టీ లెజిస్లేచర్ మీటింగ్ జరుగుతుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశాలకు హాజరవుతారు.

మూడు రోజుల పాటు...
ఈ సమావేశాల్లో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, అక్కడ కూటమి పార్టీలలో మిత్రుల నుంచి సహకారం గురించి ఎమ్మెల్యేలను అడిగి పవన్ కల్యాణ్ తెలుసుకోనున్నారు. అలాగే రేపు వివిధ రంగాల ప్రముఖులతో సమావేశాన్ని పవన్ కల్యాణ్ నిర్వహిస్తారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈనెల 30వ తేదీన బహిరంగ సభ జరగుతుంది. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 15 వేల మంది ఆహ్వానితులు తరలిరానున్నారు.


Tags:    

Similar News