Chandrababu : రెండు రోజుల పాటు విశాఖలోనే చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు, రేపటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2025-06-20 04:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు, రేపటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. 6.40 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశాఖపట్నం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు.

రేపు యోగా డేలో...
రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం కలెక్టరేట్‌లో బస చేస్తారు. రేపు ఉదయం ఉదయం 06.15 గంటలకు ఆర్కేబీచ్‌కు చేరుకుంటారు.ఉదయం 6.30 నుంచి 07.50 గంటల వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మోదీకి వీడ్కలు పలికిన అనంతరం తిరిగి అమరావతికి బయలుదేరి వస్తారు.


Tags:    

Similar News