ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కు తప్పిన ప్రమాదం
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ ప్రమాదం నుంచి బయటపడింది. మధ్యాహ్నం 2.20 గంటలకు విమానం విశాఖపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయి కొంత దూరం వెళ్లిన తర్వాత విమానం ఇంజిన్ లో పక్షి ఇరుక్కుంది. దీంతో ఫ్యాన్ రెక్కలు తిరగడం మానేశాయి.
పక్షి ఇరుక్కోవడంతో...
దీంతో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడాన్ని గుర్తించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. తిరిగి విశాఖ విమానాశ్రయంలో సేఫ్ గా విమానాన్ని ల్యండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 103 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసింది.