Andhra Pradesh : నేటి నుంచి విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది. విశాఖపట్నంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. మొత్తం పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా ఈ భాగస్వామ్య సదస్సు ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ వివిధ దేశాల్లో పర్యటించి పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వివిధ పారిశ్రామిక వేత్తలతో నేటి నుంచి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది.
నలభై దేశాల నుంచి...
ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ భాగస్వామ్య సదస్సును తొలుత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. నలభై దేశాలకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. నిన్ననే 3.65 లక్షల కోట్ల రూపాయల విలువైన 35 అవగాహన ఒప్పందాలు జరగడంతో ఈ సదస్సు ద్వారా భారీ పెట్టుబడులు ఏపీకి రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.