హీరోయిన్స్ కి ఈ దర్శకుడే విలనా?

Update: 2018-01-13 13:55 GMT

స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ ని హీరోకి తగ్గ స్థాయిలో చూపెట్టకపోయినా కొందరు దర్శకులు వారి పాత్రలను అందంగానే తీర్చి దిద్దుతారు. ఎక్కువ హైప్ హీరోయిన్స్ కి ఇవ్వకపోయినా.. కాస్త ప్రాధాన్యం అయితే ఇస్తారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం హీరోలను అన్ని రకాలుగా సూపర్ గా చూపిస్తూ హీరోయిన్స్ విషయంలో మాత్రం చులకన భావంతో ఉంటారు. అయితే ఆ కొంతమంది దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకడు. మాటల మాంత్రికుడు తన సినిమాల్లోని హీరోలకు అదిరిపోయే స్టైలిష్ లుక్ తోపాటు సినిమా మొత్తాన్ని హీరోల భుజాల మీదే మోసినట్టుగా ఆయా పాత్రలను తీర్చిదిద్దుతాడు.

టాప్ రేంజ్ ఉన్న హీరోయిన్స్ ను కూడా....

కానీ హీరోయిన్స్ విషయానికొస్తే.. వారికి ఏదో లోపమో లేకపోతె... తెలివితక్కువ వారిగానో చూపిస్తాడు. మళ్ళీ తన సినిమాల్లో అల్లాటప్పా హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకోడు. టాప్ రేంజ్ ఉన్న హీరోయిన్స్ ని మాత్రమే తన సినిమాల్లో సెలక్ట్ చేసుకుంటాడు. అలా త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ విషయానికొస్తే... ఆయన మొదటి ఫిలిం నువ్వే నువ్వే లో శ్రియ ని తెలివి తక్కువ అమ్మాయిలా చూపెడతాడు. అతడులో త్రిష పెంకిఘటం. అలాగే జల్సా లో ఇలియానాకి బుర్ర తక్కువ, ఖలేజాలో అనుష్క ని కూడా తెలివితక్కువ అమ్మాయిగానే చూపెట్టే ప్రయత్నం చేసాడు.. అంటే హీరోకి తాళం వేసే పాత్ర. ఇక జులాయి విషయానికొస్తే... ఇలియానా ని బుర్ర తక్కువ, దద్దమ్మ లా చూపించాడు. ఇక అత్తారింటికి దారేదిలో మాత్రం సమంతకి మధ్యలో గతం మర్చిపోయినట్లుగా చూపెట్టడం, సన్నాఫ్ సత్య మూర్తి లో అయితే సమంతని ఏకంగా షుగర్ వ్యాధితో చూపెట్టిన త్రివిక్రమ్ అ... ఆ సినిమాలోనూ తెలివి తక్కువ అమ్మాయిగా చూపెట్టాడు.

Similar News