టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

రేవంత్ అను నేను, మంత్రులకు కేటాయించిన కీలక శాఖలివే,82 ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు.. 114 మంది కోటీశ్వరులే.. కీలక నివేదిక

Update: 2023-12-07 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

రేవంత్ అను నేను

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ తో పాటు మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ అనే నేను అని అనగానే ఎల్బీ స్గేడియం మొత్తం రేవంత్ జిందాబాద్ అనే నినాదంతో మారుమోగిపోయింది.

Telangana : మంత్రులకు కేటాయించిన కీలక శాఖలివే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వారికి శాఖలను కేటాయించారు. కీలకమైన శాఖలను సీనియర్ నేతలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దగ్గుబాటి అభిరామ్‌ ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే?

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు తనయుడు అభిరామ్‌ పెళ్లి చేసుకున్నాడు. ప్రత్యూష చాపరాలను అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్ వేదికైంది. శ్రీలంక నుంచి తిరిగి వచ్చాక దగ్గుబాటి ఫ్యామిలీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

రేవంత్ రెడ్డికి ప్రధాని హామీ ఇచ్చేశారుగా!!

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు భాషలలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 'తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు.

ప్రగతి భవన్‌కు ఎవరైనా రావచ్చు... రేపటి నుంచే ప్రజాదర్బార్

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులపై రేవంత్ రెడ్డి సంతకం చేశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

స్పీకర్ గా గడ్డం ప్రసాద్.. పేరు ఖరారు

తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ పేరు ఖరారయినట్లు తెలిసింది. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన గడ్డం ప్రసాదరావు పేరును స్పీకర్‌గా నియమించేందుకు పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

కొత్త పీసీసీ అధ్యక్షుడు ఆయనేనా... ఆయనేతైనే బాగుంటుందంటున్న నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పీసీసీ చీఫ్ గా ఉండరు. అందుకనే త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరగబోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ఆకాశాన్ని తాకుతున్న యాపిల్ పండ్ల ధరలు.. కారణం ఏంటో తెలుసా?

ఐదు నెలల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లో కురిసిన కుండపోత వర్షాలు, వరదల కారణంగా నగరానికి పండ్ల సరఫరా దాదాపు 50 శాతం పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ నుండి నగరానికి రోజువారీ రాకపోకలు సుమారు 50 శాతం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

కేంద్రం సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి షాకిచ్చిన ప్రభుత్వం

కోట్లాది మందికి ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA)తో ముడిపడి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తోంది. దీని కోసం, ఒక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థను సిద్ధం చేశారు. దీని ప్రజలకు ఉపాధి కల్పించబడుతుంది. ఇందులో పనిచేసే వ్యక్తికి MNREGA కార్డు ఇస్తారు.

82 ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు.. 114 మంది కోటీశ్వరులే.. కీలక నివేదిక

తెలంగాణలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 119 మంది ఎమ్మెల్యేలలో 82 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌, తెలంగాణ వాచ్‌ రిపోర్ట్‌ బుధవారం నివేదికలో వెల్లడించింది. ఈ విధంగా చూస్తే దాదాపు 69 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినలు కేసులు ఉన్నట్లే.


Tags:    

Similar News