వర్మకు పవన్ పవర్ ఫుల్ రిప్లై

Update: 2017-01-27 07:13 GMT

నిత్యం ట్వీట్లతో టాలీవుడ్ హీరోలపై సెటైర్లు వేసే వర్మకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గట్టి షాకే ఇచ్చారు. తాను వర్మ మాటలను పెద్దగా పట్టించుకో బోననన్నారు. ఒకరోజు పొగుడుతారు...ఇంకో రోజు తిడతారు..అలాంటి వర్మ గురించి నేనేం మాట్లాడను అని పవన్ మీడియా సమావేశంలో చెప్పారు. వర్మకు పెళ్లికి ఎదిగిన కూతురు ఉందని, కూతురిని ఇంట్లో పెట్టుకుని పోర్న్ వీడియోలు చూస్తానని చెప్పే వ్యక్తి అన్న మాటలకు తాను సమాధానం ఇవ్వలేనని పవన్ ఘాటుగా సమాధానమిచ్చారు. యాభై ఏళ్ల వర్మ ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నారు.

వర్మ నిన్న పవన్ కల్యాణ్ పై ట్వీట్లు మీద ట్వీట్లు విసిరారు. పవన్ ను పొగిడారు కూడా. అయితే పవన్ విశాఖ కు వెళ్లకపోవడాన్ని వర్మ తప్పుపట్టారు. కత్తి పట్టుకుని యుద్ధంలో దిగాల్సిన పవన్ విశాఖకు రాలేదేమిటి? అని ప్రశ్నించారు. పవన్ నన్నెంతో నిరాశపరిశాడన్నారు. మొత్తం మీద పవన్ వర్మపై ఘాటుగానే స్పందించారు.

Similar News