రాహుల్ సరదాగా అంటే... వీహెచ్ సీరియస్ గా తీసుకుని

Update: 2017-06-03 01:40 GMT

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి సీనియర్ నేత వి.హనుమంతరావు తన బ్రేస్ లెట్ ను బహుకరించారు. ఈ నెల 1వ తేదీన రాహుల్ సభ సంగారెడ్డిలో జరిగిన సంగతి తెలిసిందే. సంగారెడ్డిలో జరిగిన సభకు అశేషగా జనం తరలిరావడం, ఏర్పాట్లు అదరహో అనిపించడంతో రాహుల్ గాంధీకి వి.హెచ్ ఈ ఏర్పాట్లన్నీ జగ్గారెడ్డి దగ్గరుండి చేశారని చెప్పారు. సభకు అయ్యే మొత్తం ఖర్చును జగ్గారెడ్డే పెట్టుకున్నారని రాహుల్ చెవిలో విహెచ్ చెప్పారు. అయతే అందుకు రాహుల్ మీరేమీ ఇవ్వలేదా? అని అడ్డగ్గా నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? అని వీహెచ్ ప్రశ్నించారు. వీహెచ్ చేతికున్న బ్రాస్ లెట్ ను చూపిస్తూ రాహుల్ అది ఇవ్వవచ్చు కదా? అని చమత్కరించారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. అయితే రాహుల్ సరదాగా అన్న మాటలను వీహెచ్ సీరియస్ గా తీసుకున్నారు. సభలో రాహుల్ జగ్గారెడ్డికి ఇవ్వమన్న బ్రేసిలెట్ ను ఆయన స్వయంగా బహుకరించారు. రాహుల్ సూచనల మేరకే జగ్గారెడ్డికి తన బ్రేస్ లెట్ ను ఇస్తున్నట్లు వీహెచ్ తెలిపారు. తానే స్వయంగా జగ్గారెడ్డికి బ్రేస్ లెట్ తొడిగారు వీహెచ్.

Similar News