బ్రేకింగ్ : చచ్చీ చెడీ సీఎం గెలిచారు

Update: 2017-12-18 06:08 GMT

దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల ట్రెండ్స్ దాదాపు తేట‌తెల్ల‌మ‌య్యాయి. 100కు పైగా సీట్ల‌లో ఆధిక్యంతో ఉన్న బీజేపీ దాదాపు అధికారం దిశ‌గా దూసుకు వెళుతోంది. ఇక హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ పోరులో రాజ్‌కోట్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ విజయం సాధించారు. అయితే ఆయ‌న చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన‌ట్టు గెలిచారు. విజ‌య్ రూపానీపై త‌న ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్ర‌నీల్ రాజ్ గురు పలుమార్లు కౌంటింగ్ లో ఆధిక్యంలోకి వచ్చారు.

స్వల్పమెజారిటీతోనే....

విజ‌య్ రూపానీ కేవ‌లం 4700 ఓట్ల ఆధిక్యంతో మాత్ర‌మే గెలిచారు. ఓ సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి ఇంత త‌క్కువ మెజార్టీతో గెల‌వ‌డం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి. ఒకానొక ద‌శ‌లో రూపానీ ఓట‌మి అంచుల వ‌ర‌కు వెళ్లి తిరిగి స్వ‌ల్ప ఓట్ల‌తో గ‌ట్టెక్కారు. మరోవైపు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌లు తిరిగి వెనుకంజలోకి వెళ్లారు.ఉప ముఖ్యమంత్రి మెహసానా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. భావ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి జీతూ వాఘాణీ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు రాధన్‌పూర్‌ నియోజకవర్గంలో ఓబీసీ నేత అల్పేష్‌ ఠాకూర్‌, వడ్గాంలో దళిత నేత జిగ్నేష్‌ మెవానీలు ముందంజలో కొనసాగుతున్నారు.

Similar News