వైరాగ్యంలో విజయసాయి రెడ్డి … ఎందుకు ?

విజయ సాయి రెడ్డి ఈ పేరు చెప్పగానే వైసీపీ లో రెండో స్థానం కోసం వినపడే పేర్లలో ఒకటి. అంతటి ప్రాముఖ్యత ఆయనకు ఆ పార్టీలో ఉంది. [more]

Update: 2021-09-05 12:30 GMT

విజయ సాయి రెడ్డి ఈ పేరు చెప్పగానే వైసీపీ లో రెండో స్థానం కోసం వినపడే పేర్లలో ఒకటి. అంతటి ప్రాముఖ్యత ఆయనకు ఆ పార్టీలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత నమ్మకస్థుల్లో విజయ సాయి రెడ్డి ఒకరు. విపక్షాలు జగన్ పై ఎన్ని విమర్శలు ఆరోపణలు చేస్తాయో అదే స్థాయిలో విజయ సాయి రెడ్డి పైనా నిప్పులు చెరుగుతాయి. జగన్ ఆర్ధిక వ్యవహారాలను గతంలో చక్కదిద్దిన విజయ సాయి రెడ్డి ఆ తరువాత కాలంలో వైసీపీ వ్యూహాల్లో చాణుక్యుడు గా పేరు తెచ్చుకున్నారు.

ఛార్టెడ్ అకౌంట్ అయినా…?

వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయ సాయి రెడ్డి జగన్ పై నమోదు చేసిన కేసుల్లోనూ ఎ2 గా ఉన్నారు. దాంతో విజయ సాయి రెడ్డి చెప్పింది జగన్ తరువాత ఫ్యాన్ పార్టీలో వేదం గా వర్ధిల్లుతుంది. ట్విట్టర్ లో తమ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పుల వర్షం కురిపించడంలో ఆయనకు ఆయనే సాటి. జగన్ పార్టీ పెట్టిన తర్వాత విజయసాయిరెడ్డి కీలకంగా మారారు. ఆయన జగన్ తర్వాత పార్టీలో నేతగా మారారు.

అలా కాలం గడిపేస్తా …

వైసీపీ అధికారంలోకి వచ్చాకా విజయసాయిరెడ్డికి కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను వైఎస్ జగన్ కట్టబెట్టారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఆయన సమన్వయం చేస్తూ వస్తున్నారు. విశాఖ లో స్వర్గీయ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం లో విజయసాయి రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. నేను భూ కబ్జాలకు, ఆస్తుల సంపాదనకు విశాఖ లో మకాం వేసానన్న విమర్శలకు జవాబుగా విజయ సాయి రెడ్డి మాట్లాడారు.

శేష జీవితాన్ని…..

తనకు ధనదాహం లేదని ప్రజాసేవకే తన జీవితం అంకితమని పేర్కొన్నారు. ఇక తన శేష జీవితం విశాఖ భీమిలిలో నాలుగు ఎకరాల వ్యవసాయక్షేత్రం ఏర్పాటు చేసుకుని గడిపేస్తా అంటూ తెలిపారు. తన పేరుతో కబ్జాలకు అక్రమాలకు పాల్పడే వారిని కొందరిని గుర్తించి ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని ఎవరైనా ఫిర్యాదు చేసినా వారి ఆట కట్టిస్తామని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానిస్తూ ధనార్జనపై తనకెలాంటి ఆశలు లేవని తేల్చేశారు. సీబీఐ కోర్టు లో ఈనెల జగన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తుది తీర్పు రానున్న నేపథ్యంలో వైసీపీ పెద్దాయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే చర్చ మొదలైంది.

Tags:    

Similar News