అంత నచ్చిందా? విజయ్..!!

మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయం అవుతున్న వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమా కరోనా లాక్ డౌన్ లేకపోతె ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ [more]

Update: 2020-04-22 06:25 GMT

మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయం అవుతున్న వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమా కరోనా లాక్ డౌన్ లేకపోతె ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా తో మంచి క్రేజ్ ఉన్న ఉప్పెన వాయిదా పడింది. అయితే ఈ సినిమాపై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉన్నాయి. అందులోను సుకుమర్ శిష్యుడు దీన్ని డైరెక్ట్ చెయ్యడం మైత్రి వారు కుర్ర హీరో అండ్ డెబ్యూ హీరో మీద అంత బడ్జెట్ పెట్టడంతో ఈ సినిమాపై అందరిలోనూ క్రేజ్ పెరిగింది.

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తీస్కోవడం, అతని కేరెక్టర్ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని భావించి విజయ్ సేతుపతి భారీ పారితోషకం ఇవ్వడం, ఉప్పెన సినిమాని తమిళనాట కూడా విడుదల చేస్తే గనక విజయ్ సేతుపతి క్రేజ్ అక్కడ కలిసొస్తుంది అని భావించిన దర్శకనిర్మాతలు విజయ్ ని తీసుకున్నారు. అయితే ఉప్పెన సినిమా మీద నమ్మకంతో ఆ సినిమాని తమినాలట డబ్ చెయ్యకుండా రీమేక్ చేసే ప్లాన్ లో విజయ్ సేతుపతి ఉన్నాడట. అందుకే తమిళ రీమేక్ రైట్స్ విజయ్ సేతుపతి సొంతం చేయూస్కున్నట్లుగా ఫిలింనగర్ టాక్. విజయ్ కి ఉప్పెన కథ నచ్చడం, తన పాత్ర మీదున్న నమ్మకంతోనే ఉప్పెన సినిమా రీమేక్ రైట్స్ కొన్నట్లుగా ఫిలింనగర్ లో వినబడుతున్న టాక్. 

Tags:    

Similar News