‘హీరో’ దర్శకుడు మారబోతున్నాడా?

డియర్ కామ్రేడ్ టాక్ తో కాస్త డీలా పడిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ తో హ్యాపీగానే కనబడుతున్నాడు. డియర్ కామ్రేడ్ మీద ఎంతో హెప్స్ [more]

Update: 2019-07-30 06:52 GMT

డియర్ కామ్రేడ్ టాక్ తో కాస్త డీలా పడిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ తో హ్యాపీగానే కనబడుతున్నాడు. డియర్ కామ్రేడ్ మీద ఎంతో హెప్స్ పెట్టుకున్న విజయ్ దేవరకొండకి డియర్ కామ్రేడ్ ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల్లాగే డియర్ కామ్రేడ్ కూడా బ్లాక్ బ్యుస్టర్ అవుతుంది అనుకుంటే.. డియర్ కామ్రేడ్ మాత్రం యావరేజ్ దగ్గరే ఆగిపోయేలా కనబడుతుంది. డియర్ కామ్రేడ్ ఫలితంతో విజయ్ దేవరకొండ కక్కలేక మింగలేక ఉన్నాడు. ఎంతో నమ్మకంతో భీభత్సమైన ప్రమోషన్స్ చేసినా.. ఉపయోగం లేకుండా పోయింది.

తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అసలు ఆ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందనే టాక్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ తెలుగు, తమిళంలో ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో చేస్తున్న హీరో మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఆ సినిమాని మైత్రి మూవీస్ వారు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా.. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ అవుట్ ఫుట్ చూసిన నిర్మాతలు.. ఆ సినిమా అవుట్ ఫుట్ నచ్చక సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశారు. ఇంకా కథలో మార్పులు చేర్పులతో మల్లి సినిమా స్టార్ట్ చేస్తారని చెబుతున్నప్పటికీ… ఇప్పుడు నిర్మాతలు దర్శకుడు ఆనంద్ అన్నామలై ని తప్పించే యోచన చేస్తున్నారని టాక్. స్క్రిప్ట్ మార్చినా… దర్శకుడు పర్ఫెక్ట్ గా తియ్యగలడు అంటేనే ఆనంద్ అన్నామలై కంటిన్యూ చేస్తారని.. లేదంటే ఆ దర్శకుడిని తప్పించి హీరో కోసం మరో దర్శకుడిని తెచ్చినా తేవొచ్చని అంటున్నారు. ఇక విజయ్ మాత్రం హీరో షూటింగ్ ఆగలేదు… మళ్ళీ మొదలు కాబోతుందని చెబుతున్నాడు.

Tags:    

Similar News