అమితాబ్ ని అడిగే ధైర్యం చేస్తారా?

ఇప్పుడు కరోనా కారణంగా అన్ని ఇండస్ట్రీస్ లో పారితోషకాల్లో కోత విషయమై నిర్మాతలంతా ఏకతాటి మీదకొచ్చారు. హీరోలు మాత్రమే కాదు…. చాలామంది స్టార్ నటులు పారితోషకాలు తగ్గించుకోవాలని [more]

Update: 2020-10-16 10:46 GMT

ఇప్పుడు కరోనా కారణంగా అన్ని ఇండస్ట్రీస్ లో పారితోషకాల్లో కోత విషయమై నిర్మాతలంతా ఏకతాటి మీదకొచ్చారు. హీరోలు మాత్రమే కాదు…. చాలామంది స్టార్ నటులు పారితోషకాలు తగ్గించుకోవాలని చెబుతున్న్న ఒక్క హీరో కానీ హీరోయిన్ కానీ ముందుకు రావడం లేదు. మాకు క్రేజ్ ఉంది.. కాబట్టి మేమెందుకు తగ్గాలనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ చితికిపోయింది, ఆదుకుందామనే భావన వాళ్లలో లేదు. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ ఇప్పటికి వెలవెలబోతున్నాయి. కొత్త ఉత్సాహం లేదు.. ఏదో షూటింగ్ కి హాజరయ్యామా సేఫ్ గా ఇంటికొచ్చామా అని అనుకుంటున్నారు కానీ… ఉత్సాహంగా సెట్స్ కి వెళ్లడం లేదు.

మళ్ళి సినిమా పరిశ్రమ ఎప్పడు కళకళలాడుతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఈలోపు పారితోషకాల కటింగ్ అనేది తెర మీదకొచ్చింది. కానీ ఎక్కడా తెగడం లేదు. తాజాగా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ కి తెలుగు దర్శకనిర్మాతలు వాల్ల సినిమాలో నటించేందుకు గాను 25 కోట్ల పారితోషకం ఇచ్చారనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. అమితాబ్ రేంజ్ ని బట్టి పారితోషకం ఫిక్స్ చేసారు అది వేరే విషయం. కానీ కరోనా కష్ట కాలంలో 20 శాతం పారితోషకాల కటింగ్ అంటున్నారు. మరి అమితాబ్ కి ఆ 25 కోట్లలో కోత పెట్టారా? లేదంటే అమితాబ్ అడిగింది ఇచ్చేస్తున్నారా.. అయినా అమితాబ్ ని మీ పారితోషకంలో 20 శాతం కోత పెట్టుకోండి అని చెప్పే ధైర్యం ఉందా? కొత్త రూల్ ప్రకారం పారితోషకాల కటింగ్ ఉంది.. మరి మీరు అని అమితాబ్ ని అడిగే ఛాన్స్ కూడా లేదు. ఇక హీరోలు మాత్రం ఎందుకు తగ్గుతారు.

Tags:    

Similar News