హాట్ బ్యూటీ టబు ఎంత తీసుకుంటుందంటే?

ఒక్కప్పటి హీరోయిన్స్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తే ఎంత తీసుకుంటారో మధుబాల- నదియా- ఇంద్రజ వంటి వాళ్ళని చూస్తే అర్ధం అవుతుంది. వీరు రీఎంట్రీ ఇచ్చి ఎక్కువ [more]

Update: 2019-07-15 11:14 GMT

ఒక్కప్పటి హీరోయిన్స్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తే ఎంత తీసుకుంటారో మధుబాల- నదియా- ఇంద్రజ వంటి వాళ్ళని చూస్తే అర్ధం అవుతుంది. వీరు రీఎంట్రీ ఇచ్చి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని అప్పటిలో టాక్ ఉండేది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో సీనియర్ హాట్ హీరోయిన్ చేరింది.

టాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న నటి టబు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టబు ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో టబు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిసింది. అలానే రానా – వేణు ఉడుగుల కాంబినేషన్ లో వస్తున్న 'విరాటఫర్వం' చిత్రంలోనూ టబు ఓ కీరోల్ పోషిస్తున్నారట.

ఇలా తెలుగు లో సినిమాలతో బిజీ కావడంతో రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ పెంచారని తెలుస్తుంది. ఒక్కో కమిట్ మెంట్ కి రూ.60 లక్షల పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె పాత్ర సినిమాలకు మెయిన్ కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ గా ఉన్నారట. రీసెంట్ గా టబు బాలీవుడ్ లో దేదే ప్యార్ దే- భారత్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు తెలుగులో కి ఎంట్రీ ఇచ్చారు

Tags:    

Similar News