రవితేజ లుక్ వైరల్…కాదు పేస్ యాప్ అంటున్నారు

మాస్ రాజా రవితేజ హిట్ అనే మాట విని చాలా ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా అనే సినిమా చేస్తున్నాడు. విభిన్న చిత్రాలు తీసే [more]

Update: 2019-08-24 10:34 GMT

మాస్ రాజా రవితేజ హిట్ అనే మాట విని చాలా ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా అనే సినిమా చేస్తున్నాడు. విభిన్న చిత్రాలు తీసే దర్శకుడు వి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫిక్షనల్ జోనర్ లో రూపొందుతుంది. రవితేజకి జోడిగా యూత్ ని ఫిదా చేసిన ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈసినిమా లో రవితేజ కోమా లోకి వెళ్లి చాలా ఏళ్ళ తరువాత తిరిగి కోమా నుండి వస్తాడు. అతను కోమా లోకి వెళ్ళకముందు పరిస్థితులు వచ్చిన తరువాత మార్పులు ఎలా ఉంటాయి అనేది సినిమా.

అయితే ఈరోజు ఉదయం రవితేజ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోలో రవితేజ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. రవితేజ 25 ఏళ్ళకి ఎలా ఉండేవాడో అలా ఈ ఫోటో లో ఉన్నాడు. షూటింగ్ సమయంలో ఈ చిత్ర స్టిల్ ఫోటో గ్రాఫేర్ తో దిగిన ఫోటో ఆ ఫోటోగ్రాఫర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతుంది. అయితే రవితేజ ఆ ఫోటోలో అంత యంగ్ గా కనిపించడానికి పేస్ యాప్ యూజ్ చేసారని కొంత మంది చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఆఫిషల్ లుక్ రావాల్సిందే.

Tags:    

Similar News