రంగస్థలం రెండు వారాల కుమ్ముడు చూసారా?

Update: 2018-04-13 07:59 GMT

రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్ లో కొల్లగొడుతుంది. ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండో వారంలోను అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి... అదరగొట్టేసింది. మగధీర తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అలాగే మొదటిసారి దర్శకుడు సుకుమార్ కూడా అదరగొట్టే కమర్షియల్ హిట్ అందుకుని టాప్ మోస్ట్ లిస్ట్ లో చేరిపోయాడు. హీరోయిన్ సమంత కూడా పెళ్లి తర్వాత బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో చిట్టిబాబు గా చరణ్ కి, రామలక్ష్మిగా సమంతకి వచ్చినంత పేరు మరే నటీనటులకు రాలేదు. అలాగే ఇంతటి పేరు కూడా వారి కెరీర్ లోనే మొదటి సారి రావడం గమనార్హం. ఇక రంగస్థలం రెండువారాల్లోనూ వరల్డ్ వైడ్ గా 100.16 కోట్ల షేర్ సాధించి ఇప్పటికి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 21.65

సీడెడ్ 14.10

నెల్లూరు 2.69

కృష్ణ 5.80

గుంటూరు 7.10

వైజాగ్ 10.55

ఈస్ట్ గోదావరి 6.33

వెస్ట్ గోదావరి 4.99

టోటల్ ఏపీ మరియు టీఎస్ షేర్స్: 73.21

కర్ణాటక 8.00

రెస్ట్ అఫ్ ఇండియా 2.55

ఓవర్సీస్ 16.40

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ కోట్లలో 100.16

Similar News