Punjab : సిద్దూతో చికాకులే… ముంచేసినా ముంచేయొచ్చు

పంజాబ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రయోగమే చేసింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను తొలగించి ఆయన స్థానంలో చరణ్ జిత్ సింగ్ బన్నీని నియమించింది. [more]

Update: 2021-10-19 16:30 GMT

పంజాబ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రయోగమే చేసింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను తొలగించి ఆయన స్థానంలో చరణ్ జిత్ సింగ్ బన్నీని నియమించింది. ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకే ఈ నియమాకం జరిగిందని వేరే చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్ అమరీందర్ కు, సిద్దూకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం సిద్దూ వైపు మొగ్గుచూపింది.

ఆయనపైనే….

అయితే ముఖ్యమంత్రిని పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో సిద్దూ పైనే ఆధారపడక తప్పని పరిస్థితి. అమరీందర్ మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రశాంత్ కిషోర్ ను కూడా ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో పాటు అకాలీదళ్ బీజేపీ నుంచి విడిపోవడం కూడా తమకు కలసి వస్తుందని అమరీందర్ ఆశించారు.

నిలకడలేని స్వభావం…

కానీ కాంగ్రెస్ హైకమాండ్ సిద్దూ కోసం అమరీందర్ ను పక్కన పెట్టింది. అయితే సిద్ధూను నమ్ముకుని ఎన్నికలకు దిగడమంటే సగం ఓటమిని కొని తెచ్చుకున్నట్లే. సిద్దూది నిలకడలేని మనస్తత్వం. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. బీజేపీ నుంచి సిద్దూ అలాగే బయటకు వచ్చారు. అలాంటి సిద్దూను నమ్ముకుని కాంగ్రెస్ పంజాబ్ ఎన్నికలకు ముందు అతి పెద్ద తప్పిదం చేసిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

టిక్కెట్ల దగ్గర నుంచి….

వచ్చే రోజులు సిద్దూ తో కాంగ్రెస్ హైకమాండ్ కు కష్టమే. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అన్నీ అవస్థలే. సిద్దూ తాను అనుకున్న వారికి టిక్కెట్ దక్కకపోతే వెంటనే రాజీనామా చేసి పారేస్తారు. ఇప్పటికే పీసీీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తే బుజ్జగించాల్సి వచ్చింది. అటువంటి మైండ్ సెట్ ఉన్న సిద్దూతో కాంగ్రెస్ కు దినదినగండమే. ఇక తప్పదు సిద్దూను తప్పించి ప్రత్యామ్నాయంగా మరో నేత లేరు. దీంతో అటయినా, ఇటయినా సిద్దూతో సర్దుకుపోక తప్పనిపరిస్థితి హైకమాండ్ ది. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. అన్న సామెత పంజాబ్ లో పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది.

Tags:    

Similar News