అందగాడిని ని వెనక్కి నెట్టిన బాహుబలి

దేశంలో పేరు ప్రఖ్యాతలతో పాటుగా.. ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో, వాళ్ళ ఫేమ్ పరంగా టాప్ 10 టాప్ 100 అంటూ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ [more]

Update: 2019-12-20 06:24 GMT

దేశంలో పేరు ప్రఖ్యాతలతో పాటుగా.. ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో, వాళ్ళ ఫేమ్ పరంగా టాప్ 10 టాప్ 100 అంటూ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ఓ లిస్ట్ ని ప్రిపేర్ చేసి.. 2018 – 2019 ఏడాదికిగాని తాజాగా విడుదల చేసిన ఆ లిస్ట్ లో క్రికెటర్స్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా… మహేంద్ర సింగ్ ధోని,సచిన్ టెండూల్కర్ టాప్ 10లో ఉన్నారు. క్రికెటర్స్ తో పాటుగా బాలీవుడ్ స్టార్స్ చాలామంది ఈ ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచారు. వరసగా విరాట్ కోహ్లీ 252.72 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా….సెకండ్ ప్లేస్‌లో అక్షయ్ కుమార్, థర్డ్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ నిలిచారు. ఇక వరసగా…ఆమితాబ్ బచ్చన్, మహేంద్ర సింగ్ ధోని, షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్,అలియా భట్,సచిన్ టెండూల్కర్,దీపికా పదుకొణెలు ఈ ఫోర్బ్స్ జాబితా టాప్‌లో 10లో నిలిచారు.

అయితే టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు టాలీవుడ్ నుండి నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేవాడు. కానీ ఈసారి మహేష్ ని వెనక్కి నెట్టిన బాహుబలి ప్రభాస్ 44వ స్థానం దక్కించుకున్నాడు. మహేష్ మాత్రం 54వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎప్పటిలాగే సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ 13ప్లేస్ లో నిలవగా.. బాహుబలి ప్రభాస్ తో పోటీపడిన కోలీవడ్ హీరో విజయ్ ప్రభాస్ తర్వాత 47స్థానం దక్కించుకున్నాడు. అయితే సంబ్రమాశ్చర్యాలతో.. ఈ ఏడాది ఫోర్బ్స్ టాప్ 100 లో టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా ప్లేస్ సంపాదించడమే కాదు.. ఏకంగా 77వ స్థానంలో నిలవడం విశేషం

Tags:    

Similar News