Thu Mar 19 2026 19:20:47 GMT+0530 (India Standard Time)
Junior Mehmood : క్యాన్సర్‌తో బాలీవుడ్ నటుడు మరణం..
జూనియర్ మెహమూద్ గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నయీమ్ సయ్యద్ నేడు శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

Junior Mehmood : జూనియర్ మెహమూద్ గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నయీమ్ సయ్యద్ నేడు శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కడుపు క్యాన్సర్ వలన నయీమ్ మృతి చెందారట. ఈ క్యాన్సర్ విషయం 18 రోజుల క్రితమే బయటపడిందట. అయితే అప్పటికే అది నాలుగో స్టేజిలో ఉందని, చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్యులు పేర్కొన్నారట. ఈ స్టేజిలో కీమోథెరపీ చేయడం కూడా చాలా బాధాకరంగా ఉంటుందని, ఆయనని ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోమని వైద్యులు సూచించారట.
ఇక ఆ క్యాన్సర్ తోనే పోరాడుతూ 67 ఏళ్ళ వయసులో ఈరోజు తెల్లవారుజామున 2:15 గంటలకు నయీమ్ సయ్యద్ తన నివాసంలోనే కన్నుమూశారు. నేడు ఆయనికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణం గురించి తెలియడంతో బాలీవుడ్ విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా నయీమ్ సయ్యద్ 1966లో 'మొహబ్బత్ జిందగీ'తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. 1968లో స్టార్ కమెడియన్ మెహమూద్తో కలిసి సుహాగ్ రాత్ సినిమాలో నటించిన తరువాత నయీమ్ సయ్యద్.. జూనియర్ మెహమూద్ ని స్క్రీన్ నేమ్ గా అందుకున్నారు.
Next Story

