Sun Dec 14 2025 02:02:30 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : రామ్చరణ్ ఇంట నెట్ఫ్లిక్స్ సీఈఓ.. హాలీవుడ్ ప్రాజెక్ట్..!
నెట్ఫ్లిక్స్ సీఈఓ రామ్చరణ్ ఇంటికి ఎందుకు వచ్చారు. అక్కడ బాహుబలి ప్రొడ్యూసర్ ఎందుకు ఉన్నారు. హాలీవుడ్ ప్రాజెక్ట్..?

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి అగ్ర నిర్మాతలు దర్శకులు పోటీ పడుతున్నారు. కానీ చరణ్ మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేవలం ఇండియాలో ఉన్న సినీ ఇండస్ట్రీస్ నుంచి మాత్రమే కాదు హాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ని అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ఓ నేషనల్ సమ్మిట్ లో తెలియజేశారు.
అయితే రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ మూవీకి సైన్ చేయలేదు. ఇది ఇలా ఉంటే, తాజాగా వరల్డ్స్ టాప్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కో-సీఈవో 'టెడ్ సరాండొస్'.. చరణ్ ని కలుసుకున్నారు. రీసెంట్ గా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ల్యాండ్ అవ్వడమే రామ్ చరణ్ ఇంటికి చేరుకున్నట్లు, అక్కడ చరణ్ తో పలు విషయాలు చర్చినట్లు సమాచారం. ఈ మీటింగ్ చరణ్ తో పాటు చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా పాల్గొన్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఫోటోలు చూసిన నెటిజెన్స్.. అసలు వీరు ఎందుకు కలుసుకున్నారు..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో వెబ్ సిరీస్ కల్చర్ పెరుగుతుంది. ఈక్రమంలోనే మెగాస్టార్ లేదా మెగా హీరోలు ఎవరితో అయినా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారా..? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరేమో.. రామ్ చరణ్ తో ఏమన్నా హాలీవుడ్ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారా..? అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో.. నెట్ఫ్లిక్స్ కో-సీఈవో, రామ్ చరణ్ తో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఇదే మీటింగ్ లో బాహుబలి ప్రొడ్యూసర్ కూడా ఉండడంతో.. రామ్ చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ అనే సందేహం ఎక్కువుగా వినిపిస్తుంది. మరి ఈ మీటింగ్ వెనుక అసలు కారణం ఏంటనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Next Story

