Wed Jan 28 2026 22:14:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : స్పీకర్ గా గడ్డం ప్రసాద్.. పేరు ఖరారు
తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ పేరు ఖరారయినట్లు తెలిసింది. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు

తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ పేరు ఖరారయినట్లు తెలిసింది. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన గడ్డం ప్రసాదరావు పేరును స్పీకర్గా నియమించేందుకు పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దళిత సామాజికవర్గానికి....
గడ్డం ప్రసాదరావు దళిత సామాజికవర్గానికి చెందిన నేత. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీని నమ్ముకునే ఉన్నారు. పార్టీ పట్ల చూపిన విధేయతకు ఆయన స్పీకర్ పదవికి ఎంపిక చేసినట్లు తెలిసింది. గడ్డం ప్రసాద్ కుమార్ అయితేనే బాగుంటుందని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వికారాబాద్ నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాదరావు గెలుపొందారు.
Next Story

