టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-11-16 12:49 GMT


భూసేకరణలో పెద్దయెత్తున అవినీతి : నాదెండ్ల

వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రోజుకో అవినీతిలో కూరుకుపోతుందన్నారు. జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో ఈ ప్రభుత్వం పేదలను వంచిస్తోందని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగనన్న కాలనీలకు భూ సేకరణ పేరిటి పెద్దయెత్తున అవినీతి జరిగిందన్నారు.

తొమ్మిదేళ్లలో కరువులేదు.. కర్ఫ్యూ లేదు

కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో కరవులేదు, కర్ఫ్యూ లేదని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నర్సాపూర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పొలాలన్నీ పచ్చగా ఉన్నాయన్నారు. గుంటలన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నాయన్నారు.

రేపు మ్యానిఫేస్టో విడుదల.. ఖర్గే చేతుల మీదుగా

తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. ఇంకా ప్రచారానికి పన్నెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ కావడంతో 28వ తేదీ రాత్రి నుంచే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. మిగిలిన పన్నెండు రోజుల్లో ప్రజల వద్దకు వెళ్లాలి.

Chandrababu Bail : చంద్రబాబు బెయిల్.. తీర్పు రిజర్వ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై వాదనలు ముగిశాయి. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటీషన్ పై విచారణ ముగిసింది.

Mahesh Babu : మరో గొప్ప నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు MB ఫౌండేషన్ స్థాపించి చిన్న పిల్లల గుండె చికిత్సలకు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికి వెయ్యికి పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి వారి గుండె చప్పుడు అయ్యారు. కేవలం ఈ ఒక్క కార్యక్రమం మాత్రమే కాదు. ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

YSRCP : హాట్ కామెంట్స్ చేసిన మంత్రి గుడివాడ అమర్‌నాధ్

ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ నుంచి చెల్లించిన పన్నులనే తిరిగి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తుందన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదన్నారు. 70 శాతం పోలవరం నిర్మించామని చెబుతున్న చంద్రబాబు అందులో 70 శాతం నిధులను కొట్టేశారని ఆరోపించారు.

ఏజ్ కాదు గేజ్ ముఖ్యం గురూ

వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ భారత్ పది మ్యాచ్ లు ఆడింది. పది మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. తొలి నాలుగు మ్యాచ్‌లలో బౌలర్ మహ్మద్ షమిని బెంచ్ కే పరిమితం చేశారు. హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా ఉండటంతో పాటు శార్దూల్ ఠాకూర్ కు కూడా అవకాశమిచ్చారు.

ఇది అప్పుల తెలంగాణగా మార్చేశారు

గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అర్బన్ నిరుద్యోగం దేశంలో కన్నా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు.

‍Nandamuri Balakrishna : ఇద్దరం కలిశాం.. ఇక అంతే

తెలుగుదేశం, జనసేన కలయిక కొత్త శకానికి నాంది అని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసుకుని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. హిందూపురం నియోజకవర్గంలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాలకృష్ణ జనసేన కండువా కప్పుకుని అలరించారు.

Telangana Elections : జగన్ బాటలోనే మేము కూడా.... అదే సక్సెస్ దారి అట

తెలంగాణలోని అన్ని పార్టీలూ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తాము అధికారంలోకి వస్తే అమలు పరుస్తామని చెబుతున్నారు. ఏపీలో ఈ విధానాలు సక్సెస్ కావడంతో ఇక్కడ కూడా అదే తరహా విధానాలను అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు.



Tags:    

Similar News