టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-11-13 12:52 GMT


BRS : రేవంత్ ను ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చీఫ్ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఆయన గత కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలిపారు. ఆయనను ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని కోరారు. ఇటీవల దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, తాజాగా అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడులు ఇందులో భాగమేనని వారు వికాస్ రాజ్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Fire Accident : అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి... ఒకే కుటుంబంలో

నాంపల్లిలోని బజార్‌ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదం విషాదం నెలకొల్పింది. కుటుంబం మొత్తం సజీవదహనమయింది. రెండో ఫ్లోర్‌లో ఉన్నవాళ్లే ఎక్కువ మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తం నాలుగు అంతస్థుల భవనంలో అనేక కుటుంబాలు నివాసముంటున్నాయి.

Fire Accident : అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ ప్రకటన

బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 9.30 గంలకు తమకు సమాచారం అందిందని, వెంటనే ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చామని తెలపారు. కెమికల్ డ్రమ్ముల వల్లనే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో తమ శాఖ 21 మందిని రక్షించిందని ఆయన అన్నారు.

KCR : కాంగ్రెస్ వస్తే ఇక ఇంతే సంగతులు

ఓటు ను ఆలోచించి వేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంటు వస్తుందని ఆయన అన్నారు. నర్సంపేటలో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భయానకమైన పరిస్థితి ఉండేది అన్నారు.

Revanth Reddy : మద్యం తాగి మాట్లాడుతున్నారా? మతిలేక మాట్లాడుతున్నారా?

బీఆర్ఎస్ నేతలు ఇళ్లు కట్టించలేదు కానీ, ప్రతి వీధిలో బెల్ట్ షాపులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మద్దూరులో వంద పడకల ఆసుపత్రి, స్టేడియంను కట్టిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.

Pawan Kalyan : అలాంటప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారో.. ఏమో?

జనసేన పార్టీది రూట్ అర్థం కాకుండా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేయలేదు. ఒక్క మోదీ పాల్గొన్న బీసీ సదస్సులో పాల్గొనడం మినహా తమ అభ్యర్థుల ప్రచారానికి ఆయన పూనుకోకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

BiggBoss 7 : ఎలిమినేట్ అయిన భోలె ఎంత సంపాదించాడో తెలుసా..?

BiggBoss 7 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 తొమ్మిది వారలు పూర్తి చేసుకొని 10వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీజన్ లో ఎలిమినేషన్స్ చాలా ఇంటరెస్టింగా సాగుతున్నాయి. సీజన్ ఫస్ట్ హాఫ్ లో వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అయితే, సెకండ్ హాఫ్ లో అందరూ అబ్బాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు.

చంద్రుని కోసం రాలిపోతున్న చుక్కలు!

చంద్రబాబునాయుడు అదృష్ట జాతకుడు. ఆయనకు పెద్దగా గ్లామర్‌ లేదు. ఎన్టీయార్‌, కేసీయార్‌ లాగా జనరంజకంగా ప్రసంగించలేరు. కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. అయినా నలభై ఏళ్లుగా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. పద్నాలుగేళ్లు, ముఖ్యమంత్రిగా మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా కీలక పాత్రలు పోషించారు.

World Cup 2023 : ఫోకస్ అంతా గ్యాలరీ వైపే.. కోహ్లి వికెట్ తీయగానే

వన్డే వరల్డ్ కప్ లో అనేక మ్యాచ్‌లు అలరిస్తుంటాయి. ఆటగాళ్ల గార్ల్‌ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ ను వీక్షిస్తుంటారు. కెమెరాలన్నీ వీరిపైనే ఎక్కువగా ఫోకస్ అవుతుంటాయి. శుభమన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పుడు సారా టెండూల్కర్ చూపించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Kadapa : అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణ హత్య

అప్పు తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగిందుకు ఒక యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన కడలో చోటు చేసుకుంది. దీపావళి పండగ రోజు ఈ విషాదం జరగడంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కడప పట్టణంలోని చిన్న చౌక్ ప్రాంతానికి చెందిన కిరణ్ దగ్గర సాయిపేట కు చెందిన మహేష్ యాభైవేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.

Tags:    

Similar News