Sun Mar 08 2026 02:18:08 GMT+0530 (India Standard Time)
Fire Accident : అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ ప్రకటన
బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ ప్రకటన విడుదల చేసింది.

బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 9.30 గంలకు తమకు సమాచారం అందిందని, వెంటనే ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చామని తెలపారు. కెమికల్ డ్రమ్ముల వల్లనే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో తమ శాఖ 21 మందిని రక్షించిందని ఆయన అన్నారు.
ఫైర్ సేఫ్టీ పరికరాలు...
బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని అగ్నిమాపక శాఖ తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారని అగ్నిమాపక శాఖ తెలిపారు. అక్రమంగా బిల్డింగ్ సెల్లార్ కెమికల్ డ్రమ్ములు ఉంచారన్నారు. ఆ డ్రమ్ముల వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. దీనిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. బిల్డింగ్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story

