పుత్రోత్సహం తో వెలిగిపోతున్నాడు

టాలీవుడ్ లో మ్యూజిక్ దిగ్గజం ఎం. ఎం. కీరవాణి… తన తమ్ముడు రాజమౌళి సినిమాలకు సంగీతం ఇస్తూనే బయట సినిమాలు చేస్తుంటాడు. అయితే కీరవాణి కొడుకు కాల [more]

Update: 2019-12-26 07:34 GMT

టాలీవుడ్ లో మ్యూజిక్ దిగ్గజం ఎం. ఎం. కీరవాణి… తన తమ్ముడు రాజమౌళి సినిమాలకు సంగీతం ఇస్తూనే బయట సినిమాలు చేస్తుంటాడు. అయితే కీరవాణి కొడుకు కాల భైరవ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్. కాకపోతే ఇప్పటివరకు పెద్దగా హైలెట్ అవ్వలేదు కానీ.. తాజాగా కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ హీరోగా నటించిన మత్తువదలరా సినిమాకి నేపధ్య సంగీతంతో అదరగొట్టేసాడు. అంతేనా కీరవాణి చిన్న కొడుకు మత్తువదలరా సినిమాతో అందరి మత్తు వదిలించేసాడు. పెద్దగా అంచనాలు లేకుండా రాజమౌళి ప్రమోషన్స్ తో నిన్న విడుదలైన మత్తువదలరా సినిమాకి హిట్ టాక్ పడడమే కాదు.. కీరవాణి కొడుకులు కాల భైరవ, శ్రీ సింహాలను టాలీవుడ్ ప్రముఖులు పొగిడేస్తున్నారు.

కాల భైరవ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఇంతెత్తులొ నిలబెట్టగా.. శ్రీ సింహ కామెడీ టైమింగ్, నటన అన్ని సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. కీరవాణి కొడుకు హీరో అంటే.. ఏ మాస్ సినిమాతోనే, లేదంటే భారీ బడ్జెట్ తోనో వస్తాడనుకుంటే.. తనకు తగిన పాత్రతో ఎలాంటి అంచనాలు లేకుండా రావడమే కాదు.. రావడం రావడమే తన సత్తా చాటి తానేంటో నిరూపించాడు. కీరవాణి కొడుకు కల తెర మీద కనబడింది. ఓ సాధారణ కొరియర్ బాయ్.. పరిస్థితుల ప్రభావంతో.. మర్డర్ కేసు నుండి ఎలా బయట పడ్డాడో అనేది.. సింహ నేచురల్ గా మెప్పించాడు. ఇక కాల భైరవ సంగీతంలో కీరవాణి హెల్పింగ్ హ్యాండ్ ఉందనుకునే వారికి…. ఇది కీరవాణి హెల్ప్ తో తెరకెక్కిన మ్యూజిక్ కాదు.. కాల భైరవ మ్యూజిక్ లో కొత్తదనం, కీరవాణి మ్యూజిక్ వాసన ఎక్కడా మత్తువదలరా లో కనిపించలేదు అంటూ కాల భైరవ మ్యూజిక్ ని పొగిడేస్తున్నారు అంతా. మరి ఒకేసారి కొడుకుల సక్సెస్ చూసిన కీరవాణి పొంగిపోతున్నాడంటే నమ్మాలి.

Tags:    

Similar News