దిల్ రాజు.. రవితేజని మార్చేశాడు..!

వరుణ్ తేజ్ – వెంకీ కాంబినేషన్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని 100 కోట్లు క్లబ్ లో [more]

Update: 2019-02-21 11:56 GMT

వరుణ్ తేజ్ – వెంకీ కాంబినేషన్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని 100 కోట్లు క్లబ్ లో చేరింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసాడు. ఎఫ్ 2 ప్రమోషన్స్ అప్పుడు నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అయితే ఎఫ్ 3లో మాస్ మహారాజ్ రవితేజ ఉంటాడు అని ఫిలింనగర్ లో మొన్నటి వరకు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ రవితేజ ప్లేస్ లో వేరే యంగ్ హీరోని పెట్టాలని డిసైడ్ అయ్యాడు దిల్ రాజు.

రవితేజ స్థానంలో నితిన్

ఆ యంగ్ హీరో ఎవరో కాదు నితిన్ అంట. అవును నితిన్ ను ఎఫ్ 2 సీక్వెల్ లో పెట్టి.. రవితేజతో “రాజా ది గ్రేట్” సీక్వెల్ ని తెరకెక్కించాలని దిల్ రాజు ప్లాన్ అంట. అయితే ఈ విష పై దిల్ రాజు క్యాంపు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అనిల్ అయితే ఎఫ్ 2 సీక్వెల్ కథ కాకుండా మహేష్ తో చేసే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

Tags:    

Similar News