మూడంచెల భద్రతతో గాంధీ ఆసుపత్రిలో?

గాంధీ ఆస్పత్రికి భద్రతను కట్టుదిట్టం చేశారు. కరోనా పాజిటివ్ పేషెంట్లు డాక్టర్ల పై దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 200 మంది పోలీసు [more]

Update: 2020-04-03 01:30 GMT

గాంధీ ఆస్పత్రికి భద్రతను కట్టుదిట్టం చేశారు. కరోనా పాజిటివ్ పేషెంట్లు డాక్టర్ల పై దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 200 మంది పోలీసు అధికారులతో గాంధీకి సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భద్రతా పర్యవేక్షణ నార్త్ జోన్ డిసిపి కమలేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. అంతేకాకుండా ఆసుపత్రిలోని 5 ,6, 7, 8 అంతస్తులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నాలుగు అంతస్తుల్లో రెండు అంతస్తుల్లో ఐసొలేషన్ వార్డులు ఉండగా రెండు అంతస్తుల్లో కరోనా పాజిటివ్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ నిర్వహిస్తున్నారు. ప్రతి వార్డు కు ఒక ఎస్సై తో పాటు కొంతమంది ఆర్మ్ డ్ పోలీస్ అధికారులను నియమించారు. దీంతోపాటుగా గాంధీ ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఇన్స్ పెక్టర్ ఇన్చార్జి తో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రి బ్లాక్ ముందు ఇద్దరు ఇన్స్ పెక్టర్ల తో సెక్యూరిటీని పెట్టారు. ఇద్దరు అడిషనల్ డిసిపి లతో పాటు ఇద్దరు ఏసీపీలు 12 మంది ఇన్స్పెక్టర్లు 27 మంది ఎస్ఐలతో గాంధీలు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. మొత్తం 200 మంది పోలీసు అధికారులతో గాంధీని చక్రబంధం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Tags:    

Similar News