హైదరాబాద్ లో ఆగడం లేదు.. నిన్న ఒక్కరోజే

హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. నిన్న తెలంగాణా రాష్ట్రంలో 21 కరోనా పాజటివ్ కేసులు నమోదయితే ఒక్క హైదరాబాద్ లోనే 20 కేసులు నమోదయ్యాయి. [more]

Update: 2020-05-04 01:57 GMT

హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. నిన్న తెలంగాణా రాష్ట్రంలో 21 కరోనా పాజటివ్ కేసులు నమోదయితే ఒక్క హైదరాబాద్ లోనే 20 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 545 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు పదిహేడు జిల్లాలు గత పథ్నాలుగు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకూ తెలంగాణలో 29 మంది మృతి చెందారు. హైదరాబాద్ లో కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

Tags:    

Similar News