చిరంజీవి మళ్లీ కదులుతున్నారా?

చిరంజీవి సరిగ్గా పదకొండేళ్ళ క్రితం అంటే 2018 ఆగస్ట్ లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీకి దిగిగే [more]

Update: 2019-08-28 00:30 GMT

చిరంజీవి సరిగ్గా పదకొండేళ్ళ క్రితం అంటే 2018 ఆగస్ట్ లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీకి దిగిగే దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. కేవలం 18 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో గెలిచిన వారంతా చిరంజీవితో సహా తరువాత కాలంలో కాంగ్రెస్ లో కలిసిపోయారు. దానికి విలీనం అని అందమైన పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా గంటా శ్రీనివాసరావు తన చిరకాల మంత్రి కోరికను తీర్చుకున్నారు. ఇక 2014 నాటికి విభజన వల్ల కాంగ్రెస్ మట్టికొట్టుకుపోగా గంటా శ్రీనివాసరావు తెలివిగా టీడీపీలోకి తన గ్యాంగ్ తో సహా చేరిపోయారు. 2019 ఎన్నిల నాటికి వైసీపీ గాలి బలంగా వీచినా సరే జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచే పోటీ చేయకతప్పింది కాదు. మొత్తానికి గంటా గెలిచినా పార్టీ ఓడిపోవడంతో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు.

మాజీలంతా కలుస్తారా…

ఇక చూసుకుంటే ప్రజారాజ్యంలో చిరంజీవి వన్ టైం సెటిల్మెంట్ గా కేంద్ర మంత్రి పదవిని పొందారు. రాజ్యసభ పదవీకాలం కూడా పూర్తి అయ్యాక ఆయన రాజకీయాల నుంచి నెమ్మదిగా తప్పుకున్నారు. తన సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో రాజకీయ పరిణామాలు మారడం, రాజకీయ అపర చాణక్యుడు చంద్రబాబు ఓటమి పాలు కావడం, జగన్ సీఎం కావడం జరిగిపోయాయి. దీంతో ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని అ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీలోకి ప్రముఖులను చేర్పించుకుంటోంది. ఇక మెగాస్టార్ మీద కమలం కన్ను పడిందని కూడా టాక్ నడిచింది. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి కూడా ఈ విషయం ఒప్పుకున్నారు. ప్రస్తుతానికి సినిమాలే అంటూ ఆయన తన రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ అలా ఉంచేశారు. ఈక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా చిరంజీవిని కలవడం ఆసక్తిని గొలిపే అంశంగా చెప్పుకోవాలి.

చిరు సరేనంటే …

ఇక చిరంజీవి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వారంతా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, మాజీ ఎమ్మెల్యేలుగావివిధ పార్టీలలో ఉన్నారు. చిరంజీవి కనుక బీజేపీకి నాయకత్వం వహించి ముందుకు వస్తే వీరంతా ఏ పార్టీలో ఉన్నా కూడా చిరంజీవి చుట్టూ ఉంటారని అంటున్నారు. సంధానకర్తగా గంటా శ్రీనివాసరావు ఎటూ ఉన్నారు. ఇపుడు వైసీపీ సర్కార్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారంతా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచింది ప్రజారాజ్యం నుంచే. ఇక టీడీపీలో ఉన్నా కూడా వారు సైతం చిరంజీవి వెంట నడుస్తార‌ని అంటున్నారు. మరో వైపు తమ్ముడు జనసేన పార్టీ పట్ల విశ్వాసం చూపించలేకపోతున్న వారు సైతం చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఆయన వెంట నడుస్తారని అంటున్నారు. పొలిటికల్ మాస్టర్ మైండ్ గా గంటా శ్రీనివాసరావు ఉన్న నేపధ్యంలో గోదావరిలో బలమైన కాపు సామాజిక వర్గం నేతలు కూడా కమలం వైపు చూస్తారని అంటున్నారు. మరి గంటా చిరంజీవి భేటీ ఏ రకమైన రాజకీయ పరిణామాలకు దారితీయిస్తుందో చూడాలి.

Tags:    

Similar News