అనుకున్నట్లుగానే అయిందిగా

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ చాణుక్యుడిగా పేరుంది. 2014 ఎన్నికల్లో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ శ్రేణులు ఎలాంటి ఆందోళనలకు దిగకుండా అడ్డుకున్నారు. ఒక్క ప్రత్యేక [more]

Update: 2019-09-11 05:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ చాణుక్యుడిగా పేరుంది. 2014 ఎన్నికల్లో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ శ్రేణులు ఎలాంటి ఆందోళనలకు దిగకుండా అడ్డుకున్నారు. ఒక్క ప్రత్యేక హోదా పేరుతో వైస్ జగన్ చేసే దీక్షలను తప్ప మిగిలిన విపక్ష పార్టీ ఆందోళనలను పోలీసులతో సమర్థవంతంగా అణిచివేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా 2014 ఎన్నికల ఫలితాల తర్వాత అంత త్వరగా ఆందోళనలకు పూనుకోలేదు.

దృష్టి మొత్తం ఇక్కడే….

కానీ చంద్రబాబు మాత్రం పొరుగురాష్ట్రమైన తెలంగాణలో పార్టీని పూర్తిగా వదిలేశారు. అలాగే ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వైపు కూడా చూడలేదు. జాతీయ రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఆయన దృష్టంతా ఆంధ్రప్రదేశ్ పైనే. జగన్ ప్రభుత్వంపైనే. జగన్ ప్రభుత్వం చేసే చిన్న తప్పులను పెద్దవిగా చూపించడమే చంద్రబాబు లక్ష్యం. తాజాగా పల్నాడులో చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహించారు. గతంలో వైసీపీ ఇలాంటి ఆందోళనలు చేసినా పెద్దగా మీడియా ప్రచారం లభించలేదు.

మీడియాలో మంచి ప్రచారం….

చంద్రబాబు చేపట్టిన తొలి కార్యక్రమానికే మీడియాలో మంచి ప్రచారం లభించింది. తాను చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చినా పోలీసులు అడ్డుకుంటారని చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నేతలను, క్యాడర్ ను రావాల్సిందిగా పిలుపునిచ్చారు. చంద్రబాబు అనుకున్నట్లుగానే పల్నాడు కార్యక్రమానికి బ్రేక్ వేసేశారు పోలీసులు. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్ ను అమలు చేసి ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చివరకు చంద్రబాబును కూడా గృహనిర్బంధంలో తీసుకున్నారు.

క్యాడర్ కు బూస్ట్….

ఇక చంద్రబాబు తన కార్యక్రమానికి ఆటంకం ఏర్పరిస్తే ఊరుకుంటారా? వెంటనే దీక్షకు దిగారు. తన నివాసంలోనే వైసీపీ బాధితులకు అండగా తాను 12 గంటల దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. దీంతో చంద్రబాబుకు మంచి మైలేజీ లభించింది. తాను అనుకున్నట్లు స్ట్రాటజీ వర్క్ అవుట్ అయింది. పల్నాడు పర్యటన లేకుండానే ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే క్యాడర్ కు మంచి బూస్ట్ దొరికిందని కూడా అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News