వైసీపీ ఎమ్మెల్యేలు ఈ స్టాండ్ తీసుకుంటారా?

అమరావతి రాజధాని తరలింపు ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏంచేయాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు. మూడు రాజధానులు ఉంటాయని [more]

Update: 2019-12-26 09:30 GMT

అమరావతి రాజధాని తరలింపు ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏంచేయాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు. మూడు రాజధానులు ఉంటాయని జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యేలు మౌనంగానే ఉంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని జగన్ వద్దకు తీసుకెళ్లేందుకు వీరంతా నేడు సమావేశం కానున్నారు. అయితే వీరు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఉద్యమం ఊపందుకోవడంతో….

ఇప్పటికే అమరావతి జేఏసీగా అన్ని పార్టీలూ, ప్రజాసంఘాలు కలిపి ఏర్పడి ఉద్యమానికి సిద్ధమయ్యారు. అమరావతిని రాజధానిగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజధానికి చెందిన 29 గ్రామాల రైతులు గత పదిరోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లాలో కూడా ఉద్యమ సెగ తాకింది. రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం తమ భూములు త్యాగం చేశామని, ఆ మాత్రం పదవులు త్యాగం చేయలేరా? అని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం….

ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం ఆసక్తి కలిగిస్తుంది. ఇప్పటికే తమ అధినేత రాజధాని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం, జీఎన్ రావు కమిటీ కూడా నివేదిక ఇవ్వడంతో దానిపై వైసీపీ ఎమ్మెల్యేలు చర్చిస్తారని చెబుతున్నారు. సెక్రటేరియట్ తరలించినప్పటికీ ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించనున్నారు. రాజధాని ప్రాంతంలో భూములు ఏ మాత్రం విలువ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని వీరు ప్రభుత్వాన్ని కోరననున్నట్లు తెలిసింది.

రైతులకు న్యాయమే ప్రధాన అజెండా…

అయితే జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వీరు ఎలాంటి ముందడగు వేయలేరు. అమరావతిని రాజకీయ రాజధానిగా ఉంచాలని వారు కోరనున్నారు. దీంతో పాటు రైతులకు న్యాయం చేయాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే ఈ సమావేశం వైసీపీ అధిష్టానం ఆలోచన మేరకే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత తమ నిర్ణయాలను వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించనున్నారు.
.

Tags:    

Similar News