అయిపోతుందా? ఆగుతుందా?

కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు సంక్రాంతి పండగ సందడిలో దేశమంతా హాట్ టాపిక్ అయ్యాయి. నెంబర్ గేమ్ లో కాంగ్రెస్ జెడియు కూటమికి బిజెపికి స్వల్ప తేడానే ఉండటం [more]

Update: 2019-01-15 16:30 GMT

కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు సంక్రాంతి పండగ సందడిలో దేశమంతా హాట్ టాపిక్ అయ్యాయి. నెంబర్ గేమ్ లో కాంగ్రెస్ జెడియు కూటమికి బిజెపికి స్వల్ప తేడానే ఉండటం తో తరచూ కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కి అడుగడుగునా గండాలు ఎదురు అవుతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ ఎమ్యెల్యేల బెదిరింపులు మరోపక్క యడ్యూరప్ప టీం కాచుకుని కూర్చున్న వైనం స్వామి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయనే సంకేతాలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అంతా కర్ణాటకలో ఏమి జరగబోతుంది అన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎలాంటి పరిణామాలు ఎప్పుడు ఎలా జరుగుతాయా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

మా పార్టీలోకి అంటే మా పార్టీలోకి …

జంప్ జిలానీలు ఇప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళతారో తెలియదు కానీ బిజెపి, కాంగ్రెస్ లు మైండ్ గేమ్ మొదలు పెట్టాయి. మా పార్టీలోకి కొందరు ఎమ్యెల్యేలు వచ్చేందుకు సిద్ధం గా ఉన్నారంటూ ప్రచారం మొదలు పెట్టేశాయి. దాంతో పండగ పూటా కుటుంబ సభ్యులతో గడపాలిసిన ఎమ్యెల్యేలు తిరిగి క్యాంప్ రాజకీయాలకు తెరలేపాలిసి వచ్చింది. సంకీర్ణ కూటమితో దినదినగండం దీర్ఘాయుష్షు అన్నట్లు సర్కార్ ను నెట్టుకొస్తున్న కుమార స్వామి పలు సందర్భాల్లో కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఒకసారి ఏకంగా కన్నీరు సైతం ముఖ్యమంత్రి హోదాలో పెట్టుకోవడం దేశమంతా చూసింది.

రిసార్ట్ రాజకీయాలతో…

తాజాగా రిసార్ట్ రాజకీయాలకు తెరలేవడంతో ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. కేంద్ర నాయకత్వతం సంకీర్ణ సర్కార్ ను పడదోసేందుకు కొంత విముఖత చూపుతున్నప్పటికీ, రాష్ట్ర నాయకత్వం మాత్రం ఖచ్చితంగా కూలదోయాల్సిందేనని చెబుతోంది. ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలో ఉన్నట్లు చెబుతున్నారు. మరో ఆరుగురు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని యడ్యూరప్పే స్వయంగా ప్రకటించడం విశేషం. దీంతో రేపటికి కర్ణాటక రాజకీయాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను కుమార స్వామి ఎలా ఎదుర్కొంటారు ప్రభుత్వాన్ని నిలుపుకుంటారా లేక చేతులారా కూలగొట్టుకుంటారా అన్నది తేలిపోనుంది.

Tags:    

Similar News