Ashok : రాజుగారి కూడా జారి పోతున్నారటగా?

అశోక్ గజపతిరాజు రూటు మార్చినట్లు కన్పిస్తుంది. ఆయన తన రాజకీయ జీవితంలో తొలిసారి పక్క చూపులు చూస్తున్నట్లే కన్పిస్తుంది. విజయనగరం జిల్లాలో బీజేపీ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు [more]

Update: 2021-10-07 12:30 GMT

అశోక్ గజపతిరాజు రూటు మార్చినట్లు కన్పిస్తుంది. ఆయన తన రాజకీయ జీవితంలో తొలిసారి పక్క చూపులు చూస్తున్నట్లే కన్పిస్తుంది. విజయనగరం జిల్లాలో బీజేపీ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా కొన్ని విషయాల్లో మోదీ తనకు స్ఫూర్తిగా నిలిచారన్న మాటలు కూడా ఆయన నోటి నుంచి రావడంతో విజయనగరం జిల్లా టీడీపీలో కలకలం రేపుతుంది.

టీడీపీతో అనుబంధం….

అశోక్ గజపతిరాజు తన రాజకీయ జీవితంలో టీడీపీతోనే ఎక్కువ కాలం ఉన్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి ఆయన టీడీపీలో ఉంటూ అనేక కీలక పదవులు పొందారు. రాష్ట్రమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయనను అనేక పదవులు వరించాయి. పార్టీలో కూడా ఆయనకు సముచితమైన గౌరవం దక్కేది. ఒకానొక సమయంలో నెంబర్ 2 గా అశోక్ గజపతిరాజు పేరు వినపడేది. అయితే 2019 ఎన్నికలకు ముందు నుంచే అశోక్ గజపతిరాజు కు, హైకమాండ్ కు మధ్య గ్యాప్ పెరిగింది.

అప్పటి నుంచే మొదలయింది…

2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే విజయనగరం జిల్లా ఇన్ ఛార్జిగా వచ్చిన గంటా శ్రీనివాసరావు అశోక్ గజపతిరాజు కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా గ్రూపు ను తయారు చేశారంటారు. జిల్లాలో తీసుకున్న నిర్ణయం కూడా ఆయనకు తెలియకుండానే జరగడంతో అప్పట్లో అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ఇక 2019లో ఓటమి తర్వాత అశోక్ గజపతిరాజు ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది. దీంతో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు.

బీజేపీకి దగ్గరగా…

జిల్లాలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అయితే తన వ్యక్తిగత బలం, ఇమేజ్ తో పార్టీని గెలిపించగలనన్న నమ్మకం ఆయనకు ఉందేమో. అశోక్ గజపతిరాజు ను పార్టీ పరంగా టీడీపీ అధిష్టానం పూర్తిగా కాళ్లు చేతులు కట్టేసింది. మాట కూడా చెల్లుబాటు కావడం లేదు. పార్టీ కార్యాలయం విషయంలోనే స్పష్టమయింది. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు బీజేపీకి దగ్గరవుతున్నారని, త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన మోదీకి అనుకూలంగా మాట్లాడరని, బీజేపీ సమావేశంలో పాల్గొన్నారంటున్నారు.

Tags:    

Similar News