ఓ దండం పెట్టేశారా

విజయనగరం జిల్లా రాజకీయాల్లో పూసపాటి వారి వంశం అంటే పెద్ద పేరు. దాదాపు ఎనభై ఏళ్ల రాజకీయం వారి సొంతం మూడు తరాలుగా ప్రజా జీవితంలో ఉంటున్నారు. [more]

Update: 2019-10-03 09:30 GMT

విజయనగరం జిల్లా రాజకీయాల్లో పూసపాటి వారి వంశం అంటే పెద్ద పేరు. దాదాపు ఎనభై ఏళ్ల రాజకీయం వారి సొంతం మూడు తరాలుగా ప్రజా జీవితంలో ఉంటున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా జిల్లా ప్రజలు గౌరవిస్తారు. ఓ విధంగా విజయనగరంలోని అంగుళం అంగుళం రాజుల ఆస్తే. అటువంటిది ఉదారంగా దానధర్మాలు చేసి పేరుకు మాత్రమే రాజులుగా చలామణీ అవుతున్న కుటుంబంగా పూసపాటివారిని చెప్పుకుంటారు. ఇక పీవీజీ రాజు వారసులుగా ఆనందగజపతి, అశోక్ గజపతి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం విశేషం. తండ్రి కాంగ్రెస్ కి ఎంత బద్దులో కుమారులు అంత బద్ద వ్యతిరేకులు. ఆ విధంగా 1977 ప్రాంతంలో జనతా పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సోదరులలో అశోక్ గజపతి రాజు విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనంద్ మాత్రం వేరే చోట పోటీ చేసి ఓడిపోయారు.

టీడీపీ పునాదులు….

అన్న నందమూరి తెలుగుదేశం పార్టీని పెట్టినపుడు విజయనగరంలో మొదట జెండా ఎగువరేసింది పూసపాటి రాజులే. అన్నదమ్ములు ఇద్దరూ టీడీపీలో చేరి పునాదులుగా నిలిచారు అప్పటికే ఎమ్మెల్యేగా జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ గజపతిరాజు మళ్ళీ అనేక సార్లు ఎమ్మెల్యెగా గెలిచి టీడీపీని కూడా తనతో పాటు జిల్లాలో అభివృధ్ధి చేశారు. ఇక చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి బదలాయింపు కావడం వెనక కూడా అశోక్ గజపతిరాజు పాత్ర చాలానే ఉంది. బాబు హయాంలో రెనిన్యూ ఆర్ధిక శాఖలు నిర్వహించి మేటి అనిపించుకున్నారు. మరి బాబుతో సరిసమానంగా ఉన్న అశోక్ గజపతి రాజు పేరు ఓ దశలో పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వానికి వినిపించింది కూడా. అప్పట్లో దగ్గుబాటి చంద్రబాబులకు మధ్యేమార్గంగా అశోక్ గజపతి రాజు పేరు సీఎం పదవి రేసులో వినిపించడం అంటే ఆషామాషీ కాదు. అటువంటి టీడీపీలో ఇపుడు అశోక్ గజపతి రాజు పాత్ర ఏమిటి. ఎంత అంటే చెప్పలేని పరిస్థితి.

పొగ పెట్టిన బాబు….

విజయనగరం జిల్లా రాజకీయాలు ఏకతాటిమీద నడిపిన అశోక్ గజపతి రాజు ని కేంద్ర రాజకీయాల్లోకి పంపించి బాబు జిల్లాలో వేలూ కాలు పెట్టారు. రాజు గారికి వ్యతిరేకంగా కొత్త గ్రూపులని చేరదీశారని అంటారు. ఇంచార్జి మంత్రిగా అప్పట్లో ఉన్న గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో వేరే వర్గం చెలరేగిపోయిన తీరుకు ఫలితమే మొత్తానికి మొత్తం తాజా ఎన్నికల్లో సీట్లు లేకుండా మట్టికొట్టుకుపోవడం అంటారు. ఇక అశోక్ గజపతి రాజు ఈ తరహా రాజకీయాలకు విసిగి ఓ దండం పెట్టేశారు. ఆయన టీడీపీ గురించి కనీసం ఇపుడు ఆలొచించడంలేదు. హైదరాబాద్ లో రాజు గారు ఉన్నారని మాట తప్ప ఆయన ఎలా ఉన్నారన్నది కూడా తెలియదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు అనారోగ్యం అని తెలిసి పరామర్శకు వెళ్లారని తెలియడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బాబు ఇలా అశోక్ గజపతి రాజు ని పరామర్శించడం కూడా చర్చగా ఉంది. ఓ విధంగా అశోక్ గజపతి రాజు అవసరం ఏంటో జిల్లా రాజకీయల్లో లోటు ఎక్కడ ఉందో బాబు తెలుసుకున్నారని అంటున్నారు. మరిఅశోక్ గజపతి రాజు గతంలో మాదిరిగా విజయనగరం జిల్లా రాజకీయాల్లో చురుకుగా పలుపంచుకుంటారా అన్నది చూడాలి.

Tags:    

Similar News